HomeTelugu Newsఅన్నాడీఎంకే ఇచ్చిన వస్తువులు ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్.. వైరల్‌ వీడియో

అన్నాడీఎంకే ఇచ్చిన వస్తువులు ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్.. వైరల్‌ వీడియో

11 2స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ మూవీపై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కథ విషయంలో దర్శక, నిర్మాతలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అది ఓ కొలిక్కి వచ్చి..ఈ సినిమా ఎటువంటి ఆటంకం లేకుండా నవంబరు 6న విడుదలైంది. చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో దూసుకుపోతోంది.

కాగా ఈ చిత్రంలో అధికార పార్టీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా డైలాగ్‌లు, సన్నివేశాలు ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర మంత్రులు పలువురు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘సర్కార్‌’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. దర్శకుడు మురుగదాస్‌, విజయ్‌లను విమర్శించారు. దీంతో చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించినట్లు తెలిసింది.

ఇలా తమ అభిమాన నటుడ్ని తప్పుపట్టడాన్ని విజయ్‌ అభిమానులు సహించలేకపోయారు. తమ హీరోను బాధపెట్టిన అన్నాడీఎంకే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన మిక్సీ, ల్యాప్‌టాప్, ఫ్యాన్‌ తదితర వస్తువుల్ని తమకు వద్దని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ మాట్లాడుతూ దిగిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్‌ను ఇబ్బందిపెట్టినందుకు ఇలా చేస్తున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ఫ్యాన్‌ను ఓ అభిమాని నిప్పులో వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu