Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. తన డైలాగ్స్‌తో నటనతో.. యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. తన కెరీర్లో సాధించినవి తక్కువ విజయాలే అయిన ఈ రౌడీ హీరోకి ఓ స్టార్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందంలాంటి చాలా కొన్ని సినిమాలే అతనికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తరువాత ఆ రేంజ్‌లో విజయ్ హిట్ పడలేదు అనే చెప్పాలి. అయితే విజయ్ తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలతోపాటు మరికొన్ని తన తెలుగు హిట్స్ హిందీ రీమేక్స్ కూడా వదులుకున్నాడు.
ఈ రీమేక్స్ లో అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ లాంటివి ఉన్నాయి. వీటిలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ మంచి హిట్ సాధించింది. ఇవే కాకుండా తెలుగులో అతడు మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు ఇతర హీరోలకు సూపర్ హిట్‌లను ఇచ్చాయి.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ఆర్ఎక్స్ 100. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించారు. అయితే ఈ ఆఫర్ మొదట విజయ్ కే వెళ్లినా అతడు మాత్రం వదులుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రలాగే ఉందంటూ విజయ్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ తోపాటు మరో హీరో శర్వానంద్ కూడా ఈ సినిమామరీ బోల్డ్ గా ఉందంటూ వద్దని చెప్పాడట.
నితిన్ హీరోగా నటించిన చిత్రం భీష్మ. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఈ సినిమా స్క్రిప్ట్ విజయ్ కు నచ్చకపోవడంతో.. అతడు వదులుకున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నితిన్ కెరీర్లో మరో హిట్ గా నిలిచింది. సేంద్రీయ సాగు ప్రాముఖ్యతను చాటే సినిమా ఇది.
విజయ్ దేవరకొండ వదులుకున్న మరో సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రామ్ పోతినేనికి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందించింది. మూవీలో అతడు డ్యుయల్ రోల్ పోషించాడు. ఇదే విజయ్ కూడా ఈ సినిమాను నిరాకరించడానికి కారణంగా తెలుస్తోంది. అప్పుడా సినిమా వద్దనుకున్నా.. తర్వాత ఈ ఇద్దరూ లైగర్ తీశారు. అయితే అది విజయ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
తెలుగులో భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ బుచ్చిబాబుకు నేషనల్ అవార్డు కూడా సాధించి పెట్టింది. కానీ ఇలాంటి సినిమాను కూడా విజయ్ వద్దన్నాడు. ఈ సినిమా కథను ముందే విజయ్ కు బుచ్చిబాబు చెప్పాడు. అప్పటికి విజయ్ ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించలేదు. అయితే ఈ సినిమాను తీసే సమయానికి విజయ్ స్టార్ హీరోగా మారిపోవడంతో ఈ స్క్రిప్ట్ అతని స్థాయికి తగినట్లుగా లేదనిపించిందట.