
Vijay Deverakonda and Rana Daggubati in Tollywood Betting Scam:
హైదరాబాద్ పోలీసులు అక్రమ బెట్టింగ్ యాప్‌లపై గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు ఈ కేసులో ఇరికిపోయారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ కేసులో చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మియాపూర్ పోలీసులు టాప్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. అంతేకాదు, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ళ వంటి మరికొందరు యాక్టర్స్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మొత్తం 25 మంది సెలబ్రిటీలను పోలీసులు విచారణకు పిలిచే అవకాశముంది.
FIR has been filed against 25 celebrities, including Rana Daggubati and Vijay Devarakonda, for promoting illegal betting apps.
The Miyapur police, Hyderabad has registered a case against several Tollywood actors and social media influencers for allegedly promoting online betting pic.twitter.com/3pxgwSnANv
— News Daily 24 (@nd24_news) March 20, 2025
ఇంతటితో ఆగలేదు… టీవీ యాంకర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రచారాల్లో పాల్గొన్నట్టు సమాచారం. సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభ శెట్టి, అమృత చౌదరి, నయిని పవని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ లాంటి పలువురు సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో భాగమైన వారి జాబితా ఇంకా పెరగవచ్చని సమాచారం. ప్రముఖ సెలబ్రిటీలు, యూట్యూబర్లు ఈ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది యువతీ యువకులు మోసపోయినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి పోలీసుల దృష్టి నేరుగా సినీ పరిశ్రమపై పడటంతో పరిస్థితి తీవ్రమవుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లో ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి!
ALSO READ: Ormax విడుదల చేసిన Top 10 Star Heroes జాబితా ఇదే.. నంబర్ 1 ఎవరంటే..