Happy Birthday Vijay Deverakonda: టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తనదైన స్టైల్‌లో యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు ఈ హీరో. విజయ్ తన సక్సెస్ తో చాలా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లకు రోల్ మోడల్‌గా మారాడు. రేపు మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూద్దాం.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించాడు. కానీ ఆ టైమ్‌లో ఆయన ఎవరికీ తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ టాలెంట్ నిరుపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. నేషనల్ అవార్డ్ పొందింది.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రమోషన్‌లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్, ఆ సినిమాలో డాక్టర్ అర్జున్‌గా విజయ్ పర్ ఫార్మెన్స్ చూసి బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు. విజయ్ నటనపై ప్రశంసలు చేశారు.
టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే.. గీత గోవిందం ఆయన కెరీర్ లో వంద కోట్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీ. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండకు సొసైటీ పట్ల తన బాధ్యతను కూడా ఎక్కువే. కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తున్నారు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తారు విజయ్.
ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెట్ లోనే విజయ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.