Family Star OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు రోజులు ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
కంప్లీట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా నచ్చొచ్చేమో కానీ, మాస్ ఆడియన్స్‌కి ఈ సినిమా పెద్దగా నచ్చదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు హిట్ ట్రాక్‌లో ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఫ్యామిలీ స్టార్‌తో ఫస్ట్ ప్లాప్ ఎదురైంది. ఇలా ఎన్నో విమర్శలు మధ్య రన్ అవుతోన్న ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు నెల తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీ హక్కులను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. ఈ సినిమాను మే 6 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. మే 3 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నారని మరో టాక్ కూడా ఉంది. అది కూడా తెలుగు అండ్ తమిళ భాషల్లో ఓటీటీలోకి వదలనున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, ఈ సినిమాను ముందు రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నారని ట్విటర్ వేదికగా పోస్టులు వెలువడుతున్నాయి. రూ. 100 లేదా రూ. 120 చెల్లించి అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్‌ను వీక్షించేలా ఓటీటీ సంస్థ అందుబాటులోకి తీసుకురానుందట. థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ఓటీటీ లవర్స్‌కు ఫ్యామిలీ స్టార్ రెంటల్ విధానం పెద్ద సమస్యే అని చెప్పుకోవచ్చు. ఇలా రెంట్ విధానంలో సినిమాను స్ట్రీమింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడకపోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.