HomeTelugu Trendingరష్మిక.. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా?

రష్మిక.. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా?

2 14‘గీత గోవిందం’ తర్వాత రష్మిక, విజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదలైన దగ్గరి నుంచి విజయ్‌ దేవరకొండ, రష్మిక డేటింగ్‌లో ఉన్నారని వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్‌తో బంధం గురించి తాజాగా రష్మిక మాట్లాడారు. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ‘అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి ఏమీలేదు’ అని బదులిచ్చారు.రష్మిక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు రష్మిక, కార్తి జోడీగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించేందుకు విజయ్‌ ఇటీవల పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu