టాలీవుడ్ యంగ్ హీరో విజయదేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాత్రికి రాత్రే విజయ్‌కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రాలు ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా ఈ హీరోకి క్రేజ్ తగ్గలేదు. విజయ్ యాటిట్యూడ్ కి యువత ఫిదా అయిపోయారు. తాజాగా ఈ క్రేజీ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని సంచలన కామెంట్ చేశాడు. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్ అనుపమ చోప్రాలతో చిట్ చాట్ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ .. డబ్బుల కోసం మందు కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు. అలాగే బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దని… చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని విజయ్ అన్నాడు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొంతమంది విజయ్ వ్యాఖ్యలను సమర్దిస్తుంటే .. మరికొందరు తప్పుబడుతున్నారు.