టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా థియేటర్ దగ్గర బోల్తా పడినప్పటికీ ఈ హీరోకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. హైదరాబాద్ టైమ్స్ రిలీజ్ చేసిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్-2019’ జాబితాలో విజయ్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మీ ప్రేమ విషయం గురించి చెప్పండి అన్నఅడగగా.. సమాధానంగా.. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ముక్కుసూటిగా జవాబిచ్చాడు. ఒకవేళ తాను ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతానని తెలిపాడు. తన పర్సనల్ విషయం అందరికీ వినోదంగా మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు.
కేవలం ఆ సీక్రెట్‌ను తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మాత్రమే చెప్తానని చెప్పుకొచ్చాడు. అందరికీ చాటింపు చేయడం తనకు నచ్చదని, అది ఎవరి వ్యాపారమూ కాదని ఘాటుగానే జవాబిచ్చాడు ఈ రౌడీ హీరో. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అందరికీ వెల్లడిస్తానన్నాడు. ఇక సినిమాల పరంగా ఎవరితోనైనా నటించేందుకు సిద్ధమేనని, అయితే బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చాడు.