తెలంగాణ లో కరోనా వైరస్ విజృభిస్తుంది.ఈ మహ్మమారి కారణంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలియజేసాడు. కరోనా కారణంగా ఫైటర్ సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు విజయ్. అయితే కరోనా కలకలం సృష్టిస్తున్న నేపద్యంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని తెలిపాడు విజయ్. 24 గంటలు పోలీసులు మనకోసం పని చేస్తున్నారు. 20 రోజులు అయింది నేను బయటికి వచ్చి. లాక్ డౌన్ ఇంత విజయవంతం అవుతుంది అంటే, అది పోలీస్, ప్రభుత్వం వల్లే సాధ్యం అయ్యింది అని అన్నాడు. అలాగే ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండండి. టైమ్ పాస్ కోసం రోడ్ల మీదకు వచ్చి లాక్‌డౌన్‌ని బ్రేక్ చేయవద్దు అని చెప్పాడు ఈ రౌడీ. తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ వారు పోలీస్ లకు ప్రొటెక్షన్ కిట్లు ఇస్తున్నందుకు సంతోషం అని తెలియజేసాడు విజయ్ దేవరకొండ.