విజయ్ దేవరకొండ కాశ్మీర్‌లో `వీడీ11` చిత్రీకరణలో ఉన్న ఆయన అక్కడే చిత్ర బృందం సమక్షంలో బర్త్ డే చేసుకున్నారు. మరోవైపు `లైగర్` సినిమాకి సంబంధించిన సర్‌ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. అయితే లేటెస్ట్ గా ఆయన తన తల్లిని ఉద్దేశించి పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తన తల్లి మాధవిని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని పంచుకోగా అది వైరల్ అవుతుంది.
తన తల్లి మాధవి ప్రేమను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు విజయ్. ఇందులో ఆయన చెబుతూ, నాకు 15 సంవత్సరాల వయస్సులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన వ్యక్తికి – మీ ప్రేమ నన్ను వారి పట్ల శ్రద్ధ చూపేలా చేసింది. 8 సంవత్సరాల క్రితం, నా పేరు, నా ఉనికి గురించి మీకు తెలియదు, ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తారు, నాకు మద్దతు ఇస్తున్నారు, నా కోసం పోరాడుతున్నారు, నన్ను నమ్ముతారు, అంతేకాదు చాలా మంది నాకు షరతులు లేని ప్రేమను ఇస్తున్నారు. ఇదంతా మా అమ్మ ఇచ్చిన జన్మే వల్ల సాధ్యమైందంటూ ట్వీట్ చేశాడు విజయ్.
To someone who stopped celebrating birthdays when I was 15 – your love has made me care about them 🙂
8 years back, You didn’t know of my name, my existence, today you cheer me, support me, fight for me, believe in me and lots of you give me unconditional love. pic.twitter.com/bFhcXGpf6e
— Vijay Deverakonda (@TheDeverakonda) May 10, 2022