HomeTelugu News'మాస్క్‌ ఇండియా'.. కరోనాపై విజయ్‌ సూచనలు..

‘మాస్క్‌ ఇండియా’.. కరోనాపై విజయ్‌ సూచనలు..

15 2

కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలంతా కలిసి ‘మాస్క్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ మంగళవారం ట్విటర్‌లో మాట్లాడుతూ.. ‘మై లవ్స్‌.. మీరంతా జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటున్నా. వస్త్రంతో ఫేస్‌ని కవర్‌ చేసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని దాదాపు అడ్డుకోవచ్చు. వ్యాధి తక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మెడికల్‌ మాస్కుల్ని వైద్యులకు వదిలేయండి. మీరు వాటికి బదులు చేతి రుమాలు, స్కార్ఫ్‌ లేదా మీ అమ్మ చున్నీని వాడండి. మీ ముఖాన్ని కవర్‌ చేయండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ #MaskIndia ట్యాగ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ చిన్న పని ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుందని విజయ్‌ చెప్పారు.

ప్రొఫెషనల్‌ మాస్కుల్ని మన కోసం పనిచేసే వైద్య సిబ్బందికి ఉంచుదామని, మనం వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకుందామని హీరో సుశాంత్‌ పేర్కొన్నారు. ‘మాస్క్‌ ఇండియా’లో తాప్సీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, అదితిరావు హైదరి, సిమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. మాస్కులతో ఉన్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. అందరూ తప్పనిసరిగా ముఖాన్ని కవర్‌ చేయాలని కోరారు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ముందే ఊహించలేమని హెచ్చరించారు.

15a

Recent Articles English

Gallery

Recent Articles Telugu