HomeTelugu Big Storiesసారా అలీఖాన్‌తో డేటింగ్‌పై విజయ్‌ దేవరకొండ స్పందన

సారా అలీఖాన్‌తో డేటింగ్‌పై విజయ్‌ దేవరకొండ స్పందన

Vijaydevarakonda sara and J

తన స్టైల్, స్టార్‌డమ్‌తో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎంతోమంది బామల హృదయాలను కొల్లగొట్టారు విజయ్ దేవరకొండ. బాలీవుడ్‌ బ్యూటీస్ సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్ సైతం విజయ్‌ దేవరకొండపై మనసు పారేసుకున్నారు.

కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్‌-7లో విజయ్‌తో డేటింగ్‌ చేస్తామంటూ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో బయటకు రావడంతో దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించాడు.

vijay devarakonda1

సారా అలీఖాన్‌తో పాటు జాన్వీ కపూర్‌కు సైతం గట్టి హగ్‌, ప్రేమ ఆప్యాయతలు పంపుతున్నా అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. సారా అలీ ఖాన్‌, జాన్వి కపూర్‌ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. ఈ వీకెండ్‌లో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను తాజాగా హాట్‌స్టార్‌ రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు? అని ప్రశ్నిస్తాడు హోస్ట్‌ కరణ్‌.

దీనికి సారా సిగ్గు పడుతూ విజయ్‌ దేవరకొండ అంటూ సమాధానం ఇస్తుంది. నువ్వు కూడా విజయ్‌తోనేనా! అని కరణ్ జాన్వీతో అంటాడు. ఆ వెంటనే సారా అలీ ఖాన్‌ స్పందిస్తూ ఏంటీ నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని జాన్విని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇలా సాంతంగా ఈ ప్రోమోను విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు.

https://www.instagram.com/tv/Cf5yva4DzdX/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu