Vijay Rashmika Dating Photo
గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో.. చెరిగిపోని స్థానం సంపాదించుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక. ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ కెరియర్స్ లో.. వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి.. డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా కనిపించారు. ఇక గీత గోవిందం సినిమా దగ్గర నుంచే వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని ఎన్నో వార్తలు రాసాగాయి.
ఇందుకు తగ్గతే వీరిద్దరూ పలుమార్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ లో కూడా.. తమ అభిమానులకు చెప్పకనే తాము ప్రేమలో ఉన్నట్టు చెబుతూ వచ్చారు. కానీ ఎవరైనా ఇంటర్వ్యూలో డైరెక్టుగా అడిగితే మాత్రం తాము కేవలం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు.. విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు బ్యాక్ గ్రౌండ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అంటే వీరిద్దరూ ఒకే చోట ఉన్నారు అని అందరికీ అర్థమవుతుంది.
View this post on Instagram
ఈ క్రమంలో ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా విజయ్ దేవరకొండ తాను రిలేషన్ షిప్ లో ఉన్నాను అని కన్ఫామ్ చేశారు. అయితే ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. ఇక తాజాగా విజయ్, రష్మిక కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ తమ డేటింగ్ లో భాగంగా హోటల్ లో ఏదో తింటూ ఉండగా.. ఎవరో ఒక తెలియని వ్యక్తి ఈ ఫోటోను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ చాలా క్లియర్ గా కనిపిస్తుండగా.. రష్మిక వెనక భాగం కనిపిస్తోంది. ఇక రష్మిక .. ఇదే డ్రెస్సులో ఉన్న ఫ్రెంట్ ఫోటో కూడా వైరల్ అవుతుంది. మొత్తానికి వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని.. తింటూ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇక వీరిద్దరి పెళ్లి మాత్రమే బ్యాలెన్స్ అని.. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడు చెబుతారు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా.. విజయ్ తన ఆల్బమ్ సాంగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి చేతిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో అన్ని పూర్తయ్యాక పెళ్లిని ప్రకటిస్తారా.. మధ్యలోనే ప్రకటిస్తారా తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ALSO READ: ఈ వారం OTT releases జాబితాలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే!