VD12: టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. టాలీవుడ్‌లో పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన డ్యాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరువాత వరుస విజయాలతో మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఆమె గత రెండు సినిమాలు డిసర్జ్‌గా మిగిలాయి. ఇటీవలే విడుదలైన గుంటూరు కారం సినిమా సైతం ఆమెకు చేదు అనుభవానే మిగిల్చాయి. ఈ సినిమాకి ఆమె డ్యాన్స్, నటన ప్లస్ అయినప్పటికీ.. ఆమెకి మాత్రం మైనస్‌గానే మిగిలింది. ఈ సినిమాతో శ్రీలీలకు ఉన్న క్రేజీ కూడా తగ్గింది అనే చెప్పాలి. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ప్లేస్‌లో మరో ఇద్దరూ హీరోయిన్‌లు నటిస్తున్నట్లు టాక్.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీల పేరు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపికైందంట. ఈ విషయంపై త్రిప్తితో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌లుగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.