HomeTelugu Trendingదేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్‌లుక్‌

దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్‌లుక్‌

8 27

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఇప్పుడు హీరోను చేశాడు. మరి విజయ్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ గురించి అడిగితే విజయ్ దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్నాడు.

వీళ్లు టైటిల్ రివీల్ చేసిన విధానం చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. కథ కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు. తరుణ్ భాస్కర్ తో పాటు అనసూయ భరద్వాజ్ మరో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం విశేషం. మొత్తంగా దర్శకులు హీరోలు, హీరోలు దర్శకులు అవుతోన్న తరుణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ‘మీకు మాత్రమే చెప్తా’ లో తరుణ్ భాస్కర్ అబినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే..పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu