HomeTelugu Big StoriesVijay Devarakonda: స్టార్ హీరోలకి సైతం షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలు

Vijay Devarakonda: స్టార్ హీరోలకి సైతం షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలు

Vijay Devarakonda huge lineup surprises the fans
Vijay Devarakonda huge lineup surprises the fans

Vijay Devarakonda Upcoming Movies:

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేతిలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. ఆఖరికి స్టార్ హీరోలకంటే ఎక్కువగా వరుసగా సినిమాలు లైన్లో పెట్టేసాడు విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ ఫ్యాన్స్ విజయ్ చేతుల్లో సినిమాలు చూసి తెగ ఎక్సైట్ అవుతున్నారు.

VD12:

జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ మూవీ విడుదల కానుంది. అంటే VD13 ఈ సినిమాకి రెండవ భాగం అని చెప్పుకోవచ్చు.

VD14:

విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యంలో ఉండే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా నటించబోతోంది. గతంలో రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన టాక్సీ వాలా మంచి హిట్ అయింది కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

VD15:

రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఇది కూడా పీరియాడికల్ జోనర్ లోనే ఉంటుందట.

VD16:

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నారు. VD16 ఇదే అని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు. అది కూడా కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అంటే ఈ సినిమాకి కనీసం 3-4 ఏళ్ళ సమయం పట్టొచ్చని టాక్.

VD17:

అర్జున్ రెడ్డి తో తనని స్టార్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ సినిమా మరొక సినిమా ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాకుండా తరుణ్ భాస్కర్ తో ఒక ఇంటరెస్టింగ్ సినిమా చర్చల్లో ఉందట. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ కల్కి పార్ట్ 2 లో కూడా కనిపించనున్నారు. సుకుమార్ తర్వాత ఈ మిగిలిన సినిమాలలో ఏది ముందు మొదలు పెట్టాలో విజయ్ నిర్ణయించుకునే అవకాశం ఉంది.

ది ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ అసలు సినిమాలు చేస్తారా.. తనకి ఆఫర్లు వస్తాయా అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ లైన్ అప్ మాత్రం వాళ్లందరి నోర్లు మూయించేలా ఉంది అనడం అతిశయోక్తి కాదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu