విజయ్‌దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అక్డి పక్డి అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ చూడ ముచ్చటగా ఉందంటున్నారు.
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 25న లైగర్ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.