HomeTelugu Newsవిజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ

విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ

16 1

క్రేజీ హీరో.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మించారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లా నటించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ షెరటాన్ హోటల్లో జరిగింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావుడి, ఆతృత ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్‌లో ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్‌లో ఎగ్జయిట్‌మెంట్, వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్‌లో, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు. కానీ, ఈసారి నేనేం చేయలేదు’’ అని విజయ్ దేవరకొండ అన్నారు.

విజయ్ దేవరకొండ తాను చేసిన సినిమాలన్నింటిలో ఈ చిత్రంలోనే ఎక్కువ కష్టపడినట్టు వెల్లడించారు. ‘నోటా’లో తమిళంలో మాట్లాడటం కష్టంగా అనిపిస్తే అంతకు మించి ఈ సినిమాకు కష్టపడ్డానని చెప్పారు. ‘‘అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ఈ సినిమాను నేనేం హడావుడిగా చేయడానికి రాలేదు. సింపుల్‌గా వచ్చాం, ట్రైలర్ లాంచ్ చేశాం. ఫిబ్రవరి 9న ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆరోజు అక్కడ ఇంకా మాట్లాడతా’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ విడుదలతో మళ్లీ బయట హడావుడి మొదలవుతుందని అన్నారు. అలాగే, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తన లాస్ట్ లవ్ స్టోరీ అని చెప్పారు. ‘‘నాకు నేను మారుతున్నానని అనుకుంటున్నాను. మనిషిలా కొంచెం మారుతున్నాను. అభిరుచిలు మారుతున్నాయి. లైఫ్‌లో ఒక కొత్త దశలోకి వెళ్తున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఇదే నా లవ్ స్టోరీ కాబోతుందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో ఇంత అందమైన నలుగురు అమ్మాయిలు నటించడం నాకు దక్కిన గౌరవం’’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!