HomeTelugu Trendingశోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ!

శోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ!

4a

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ అలనాటి సోగ్గాడు శోభన్‌ బాబు పాత్రలో కనిపించనున్నారట. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘అమ్మ’గా కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలకపాత్రలు పోషిస్తున్న వారి వివరాలను చిత్రబృందం ప్రకటించింది. అయితే జయలలిత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన శోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ‘తలైవి’ చిత్రబృందం విజయ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి నటించనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu