టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన అరవింద్‌కుమార్ సోమవారం పీవీ ఘాట్ సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం విజయ్ తోపాటు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కుడా ఉద్యోగులను ఆ చాలెంజ్‌కు నామినేట్ చేశారు.
కాగా, గతంలోనూ తనను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేయడంతో విజయ్ దేవరకొండ మొక్క నాటారు. హరితహారంలో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ నిరుడు విజయ్‌ను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలంటూ ఇటీవల విజయ్ ఇటీవల ట్విటర్ వేదికగా గళం విప్పారు. విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ నెల 1న విడుదలైంది. ఆయన ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, పూరి జగన్నాథ్ సినిమాల్లో నటిస్తున్నారు.