టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తదైన స్టైల్లో నటిస్తూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాక సొంత ప్రొడక్షన్ హౌస్ మరియు ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు విజయ్. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు, హీరో విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ అన్నారు.