జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మి, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు ఓటు వేశారు. తాజగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామీలితో కలిసి వచ్చి ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ.. హైదరాబాదులో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని, శానిటైజర్లను ఏర్పాటు చేశారని, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని… ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటు వేస్తే మజా వస్తుందని అన్నాడు. కౌంటింగ్ జరిగే 4వ తేదీన ఏమవుతుందో చూద్దామని చెప్పాడు.