టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఆదాయంలో కూడా ఇతర యంగ్ హీరోల కంటే టాప్ లో ఉన్నాడు. ఆమద్య మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా కూడా నిలిచాడు. తాజాగా మరోసారి ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిల విషయంలో తను కోరుకునే కొన్ని క్వాలిటీస్ వివరించాడు విజయ్. అలాంటి అమ్మాయిని మీరు మీ జీవితంలో ఎప్పుడైన కలిసారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ అవును అని చెప్పాడు విజయ్.
దాంతో విజయ్ రిలేషన్ లో ఉన్నాడన్న విషయాన్ని ఒప్పుకున్నాడా అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం జీవితంలో స్థిరపడాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఆ ఆలోచనలోనే ఉన్నాను అని విజయ్ స్పష్టం చేశారు .ప్రస్తుతం ఈయన పూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. హిందీ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సినిమా విడుదల చేయబోతున్నారట. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.