నా కూతురుతో పాటే నేను చనిపోయాను: విజయ్‌ ఆంటోనీ

తన కూతురు మీరా మృతి నేపథ్యంలో నటుడు విజయ్ ఆంటోనీ ఈరోజు మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చెన్నైలోని వారి నివాసంలో పదహారేళ్ల పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కూతురు మరణించిన తర్వాత తొలిసారి విజయ్‌ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

డియర్‌ హార్ట్స్‌.. నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళుతుంది. ఆమె నాతో మాట్లాడుతుంది. తనతో పాటు నేనూ చనిపోయాను. ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను. ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ తన పేరు మీదను చేస్తాను అంటూ ఓ ఎమోషన్‌ నోట్‌ రాసుకొచ్చాడు.

ఈ నోట్‌ చదివిన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కుతుంది. పలువురు సెలబ్రెటీలు ధైర్యంగా ఉండు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మీరా చనిపోయే ముందు ఓ లెటర్‌ రాసింది. అందులో లవ్‌ యూ ఆల్‌.. మిస్‌ యూ ఆల్‌ అని రాసిందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu