HomeTelugu Trendingవిజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం

విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం

Antony daughter suicide

బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని ఆయనకు తీరని శోకాన్ని మిగిల్చింది.

హీరో విజయ్ ఆంటోనీ కుటుంబం చెన్నైలోని అల్వార్‌పేటలో నివాసం ఉంటోంది. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ చర్చ్ పార్క్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువు ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

మీరా ఆంటోనీ తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకున్నట్లు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మీరా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీరా మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu