HomeTelugu Reviews'బిచ్చగాడు-2' రివ్యూ

‘బిచ్చగాడు-2’ రివ్యూ

Bichagadu 2 Review

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’. ఏడేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్స్‌ ఈ చిత్రం. ఈ సినిమాకి నిర్మత మరియు దర్శకత్వం కూడా విజయ్‌ ఆంటోనీ వహించడం విశేషం. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఎవరు ఆకట్టుకుందో చూద్దాం.

విజయ్ (విజయ్ ఆంటోనీ) ఇండియాలో ఏడో అత్యంత ధనవవంతుడైన మల్టీ మిలియనీర్. తన చుట్టూ ఉండే ముగ్గురు వ్యక్తులు తన అడ్డు తొలగించుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దుబాయిలో ఉండే డాక్టర్ మెహతా జంతువుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన మెదడు మార్పిడి శస్త్రచికిత్స గురించి తెలుసుకుని.. విజయ్ మీద దాన్ని ప్రయోగించాలనుకుంటారు. తన బ్లడ్ గ్రూప్ సహా అన్నీ దగ్గరగా ఉన్న సత్య అనే బిచ్చగాడిని కిడ్నాప్ చేసి ఈ సర్జరీ కూడా పూర్తి చేయిస్తారు. విజయ్ స్థానంలోకి వచ్చిన సత్య సాయంతో మొత్తం ఆస్తిని చేజిక్కించుకోవాలన్న వీరి ప్రయత్నం ఎంతమేర ఫలించింది.. సత్య వాళ్లకు సహకరించాడా.. చివరికి ఏం జరిగింది అన్నదే కథ.

‘బిచ్చగాడు’ అనే టైటిల్ చూసి.. హీరో బిచ్చగాడు అని తెలిసి.. ముందు ఇదేం సినిమారా బాబూ అంటే వెటకారాలు ఆడారు తెలుగు ప్రేక్షకులు. అలా చిన్నచూపు చూసిన వాళ్లే.. తర్వాత లెంపలేసుకుని అదొక అరుదైన.. అద్భుతమైన సినిమా అని కొనియాడారు. ఒక మల్టీ మిలియనీర్.. తన తల్లిని బతికించుకోవడం కోసం బిచ్చగాడిగా మారడం అనే పాయింట్ ను ఎంతో హృద్యంగా.. మనసుకు హత్తుకునేలా చూపించిన ‘బిచ్చగాడు’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా వచ్చి ఎనిమిదేళ్లయింది. ఈ ఎనిమిదేళ్లలో విజయ్ ఆంటోని నుంచి రెండంకెల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.

‘బిచ్చగాడు’కు సీక్వెల్ అంటే ఎంతో ఆసక్తిగా థియేటర్స్‌కు వెళ్లి ప్రేక్షకులకు నిరాశే ఎదురైతుంది. అసలు ‘బిచ్చగాడు’ సినిమాకు దీనికి సంబంధమే లేదు. ఇది వేరే కథ. ‘బిచ్చగాడు’తో ‘బిచ్చగాడు-2’ను ఎంతమాత్రం పోల్చుకోవడానికి వీల్లేదని ఈ సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. మనం ఏదో ఊహించుకుంటే విజయ్ ఆంటోనీ ఇంకేదో సినిమా చూపిస్తాడు. కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ ను ‘బిచ్చగాడు-2’ కోసం వాడేసుకున్నాడు విజయ్. ఒక మల్టీ మిలియనీర్ చుట్టూ ఉండే టీమ్.. అతడికి వ్యతిరేకంగా కుట్ర చేసి తనకు బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చేసి తన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టడం.. దీని చుట్టూ ప్రథమార్ధంలో డ్రామాను నడిపించారు. ఈ వ్యవహారం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా.. చాలా సీన్లు లాజికల్‌ అనిపించవు. లక్ష కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ప్రవర్తించే తీరు చూస్తే.. ఇంత తింగరోడు ఇంత రిచ్ ఎలా అయ్యాడో అని సందేహం కలుగుతుంది.

bichagadu 2

అతణ్ని ఒక పపెట్ లాగా మార్చి చుట్టూ ఉన్న వాళ్లు సింపుల్ గా తమ పని తాము చేసుకుపోతారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ అనగానే కొంచెం ఇంటలిజెంట్ గా సన్నివేశాలు నడవాలని ఆశిస్తాం కానీ.. దర్శకుడిగా ఏమాత్రం పనితనం చూపించలేకపోయిన విజయ్ చాలా సిల్లీగా ఆ సీన్లు లాగించేశాడు. ఇక బిచ్చగాడి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ అయితే ఓవర్ సెంటిమెంట్.. మెలోడ్రామాతో ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసేలా చేస్తుంది. విజయ్ స్థానంలోకి వచ్చే బిచ్చగాడు.. తనను ఆడించాలని చూసిన వాళ్లపై ఎదురు తిరిగి వాళ్ల కథను కంచికి చేర్చే సీన్ ఒకటి ఫస్ట్‌ హాఫ్‌లో హైలైట్.

ఇంటర్వెల్ టైమ్‌కి ‘బిచ్చగాడు-2’ కొంచెం గాడిన పడ్డట్లు అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం మళ్లీ ట్రాక్ తప్పేస్తుంది. సెంటిమెంట్ సీన్లు ఏపీ కూడా హృదయాన్ని తాకవు. ఇక ‘యాంటీ బికిలి’ అంటూ హీరో తన ఆస్తినంతా పేదలకు సాయం చేయడానికి ఉపయోగించాలని నడుం బిగించడం… ఆ తర్వాత వచ్చే సన్నివేశాలైతే సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోయేలా చేస్తాయి. హీరో పదే పదే ‘స్పీకర్’గా మారిపోయి పేదరికం గురించి.. సేవ గురించి స్పీచులు దంచడంతోనే చివరి 40 నిమిషాల సినిమా నడిచిపోతుంది. కోర్టు సీన్లయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. మామూలుగా తమిళ సినిమాల్లో ఉండే అతి అంతా ఇక్కడ కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్లు కూడా విసుగును పెంచుతాయి. సినిమా స్టార్టింగ్‌కి ఎండింగ్‌కి అసలు సంబంధమే ఉండదు. ‘బిచ్చగాడు’లో హైలైట్ అయిన హ్యూమన్ యాంగిల్ ను ‘బిచ్చగాడు-2’లో ఎంతమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు విజయ్ ఆంటోనీ.

‘బిచ్చగాడు-2’లో సినిమా అంతా విజయ్‌ ఆంటోనీ తన ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. కావ్య థాపర్ ఆరంభంలో వచ్చే పాటలో చాలా హాట్ హాట్ గా కనిపించింది. నటన పరంగా చెప్పడానికి ఏమీ లేదు. విలన్ పాత్రల్లో దేవ్ గిల్.. జాన్ విజయ్.. వై.జి.మహేంద్రన్ పర్వలేదు. రాధారవి ముఖ్యమంత్రి పాత్రలో బాగానే చేశాడు. యోగిబాబు కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు. మిగతా నటీనటులంతా వారి పరిధి మేరకు నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రథమార్ధంలో ఒక పెద్ద హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. ఓం నారాయణ్ కెమెరా పనితనం బాగానే సాగింది. విజయ్ ఆంటోనీ సంగీతం ఆకట్టుకోలేదు.

టైటిల్‌ :’బిచ్చగాడు-2′
నటీనటులు: విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్, రాధా రవి, యోగిబాబు, దేవ్ గిల్ తదితరులు
దర్శకత్వం: విజయ్ ఆంటోనీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
సంగీతం: విజయ్ ఆంటోనీ

చివరిగా: అంచనాలు అందుకోలేకపోయిన ‘బిచ్చాగాడు-2’

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu