HomeTelugu Trendingనయన్‌- విఘ్నేశ్‌ పెళ్లి ఫొటో వైరల్‌

నయన్‌- విఘ్నేశ్‌ పెళ్లి ఫొటో వైరల్‌

Vignesh shivan nayanthara f
కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్‌ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

‘నయన్‌, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu