HomeTelugu Trendingనయన్‌ గోరుముద్దలు తినిపిస్తున్న విఘ్నేశ్‌ శివన్‌.. వీడియో వైరల్‌

నయన్‌ గోరుముద్దలు తినిపిస్తున్న విఘ్నేశ్‌ శివన్‌.. వీడియో వైరల్‌

Vignesh shivan feeds nayant
కోలీవుడ్‌ స్టార్‌హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య గుళ్లూ గోపురాలు చుట్టేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. జూన్‌ 9న తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడడుగులు నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తిరుపతి, షిరిడీ పర్యటనకు వెళ్లి ఇప్పుడు తమిళనాడు, కేరళలోని దేవాలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వారి మధ్య ఉన్న ఆప్యాయతను తెలియజేస్తూ విఘ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశాడు.

టేబుల్‌ మీద ఎన్నో రకాల ఐటమ్స్‌ ఉన్నాయి. అందులో ఒకటి ట్రై చేయమని విఘ్నేశ్‌ అడగ్గా నయన్‌ నో అంటూ తలూపింది. అయినా సరే అతడు మాత్రం భుజం మీద చేయి వేసి బుజ్జగిస్తూ ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. ఆ తర్వాత అతడు తిన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘సరిగ్గా తినాల్సిన సమయం ఇదే.. స్థానికంగా దొరికే రుచికరమైన ఆహారాన్ని తనకు తినిపించడంలోనే అసలైన సంతోషం ఉంది. అద్భుతమైన మనుషుల మధ్య రుచికరమైన ఫుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాము’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఈ ప్రేమజంట లవ్‌కు ఫిదా అవుతుంటే కొద్దిమంది మాత్రం మా సింగిల్స్‌ ఏమైపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Recent Articles English

Gallery

Recent Articles Telugu