స్టార్ హీరోయిన్ నయనతార శుక్రవారం 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. కాగా, నయన్‌కు ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు కావడంతోపాటు ఇదే ఏడు ఇద్దరు పిల్లలు కూడా ఆమె జీవితంలోకి వచ్చారు. దీంతో ఈ స్పెషల్ డేను తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా జరుపుకుంటోంది. ఇదే సందర్భంలో విఘ్నేష్ శివన్ నయన్‌కి స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
‘నయన్.. నువ్వు నా జీవితంలోకి వచ్చాకా లైఫ్ చాలా అందంగా, సంతృప్తికరంగా ఉంది. నీతో ఇది నా తొమ్మిదో పుట్టినరోజు. అవన్నీ ఎంతో స్పెషల్, మెమోరబుల్, డిఫరెంట్. అయితే, ఈ పుట్టినరోజు మనకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే భార్య, భర్తలుగా జీవితాన్ని ప్రారంభించాం. ఇదే సందర్భంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాం..’ అంటూ రాసుకొచ్చారు. నయన్‌తో ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఈ పోస్టు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/p/ClF_PmmyTx1/?utm_source=ig_web_copy_link