కోలీవుడ్ ప్రేమ జంట నయనతార-విఘ్నేష్ శివన్‌లు గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలె వీరి పెళ్లి మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది చివర్లో నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఉంటుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే విఘ్నేశ్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం తామిద్దరం ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజగా ఉన్నామని, కెరీర్‌పరంగా మేం సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా డేటింగ్ లైఫ్‌పై తమకు బోర్ కొట్టినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. అయితే తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలోనే నయన్-విఘ్నేష్‌లు దంపతులుగా మారనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు
తాజాగా నెటిజన్లతో ముట్టడించిన విఘ్నేష్.. వారికి వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఓ యూజర్.. మీరు, నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం అని పేర్కొనగా.. వివాహం ఖరీధైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని బదులిచ్చాడు. అంతేకాకుండా త్వరగా కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పెళ్లికి తామిద్దరం సిద్ధంగానే ఉన్నామని, కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పెళ్లి ఉంటుందని విఘ్నేష్ హింట్ ఇచ్చేశాడు అని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నయనతార వివాహం జరగనుంది. ఘీ రైస్, చికెన్ కర్రీ నయనతారకు ఇష్టం అని విఘ్నేష్ తెలిపారు.