పుల్వామా అటాక్ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాల రగిలినసంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పాకిస్థానీ నటులపై కూడా మన వాళ్లు నిషేధం విధించారు. ఈ విషయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేసారు కూడా. సల్మాన్ ఖాన్ ఏకంగా తన సినిమాలో పాకిస్తానీ గాయకుడు పాడిన పాటను తీసేసి మళ్లీ మన గాయకుడితో పాడిస్తున్నాడు. ఇక ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఈ విషయంపై స్పందించింది. పాకిస్తానీ నటులను ఇండియాలో బ్యాన్ చేయడంపై ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
నిజం చెప్పాలంటే కళలకు సరిహద్దులు ఉండవు.. అందర్నీ ఒక్కటి చేసేది ఈ కళలే.. రాజకీయాలకు, సరిహద్దులకు అతీతమైనవి కళలనేవి అని చెప్పింది విద్యాబాలన్. ఇక ఈ కళల్లో కేవలం నటన మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంటాయని.. సంగీతం, సినిమా, నాట్యం, నాటకాలు, రచన అన్నీ ఇందులోకే వస్తాయని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇవన్నీ ప్రాంతం, దేశంతో పని లేకుండా ప్రజలకు చేరువ చేస్తాయని కామెంట్ చేసింది విద్యాబాలన్. అయితే కొన్ని సార్లు కళల కంటే కూడా దేశం గొప్పదనేది గుర్తు పెట్టుకోవాలి. ఎంత కళ అయినా కూడా దేశం తర్వాతే కాబట్టి కొన్నిసార్లు మన భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని చెప్పింది ఈ విద్యా. పాకిస్తానీ నటులను నిషేధించడం కాస్త బాధ కలిగించినా కూడా తప్పదంటుంది ఈ హాట్ బ్యూటీ.