HomeTelugu Newsశ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా

శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా

5 15క్రేజీ తార సిల్క్‌ స్మిత పాత్రలో ఒదిగిపోయి బోల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌. ఇటీవలే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కూడా బసవతారకంగా కనిపించారు. తాజాగా తన అభిమాన నటి కోసం కాస్త కష్టంతో కూడుకున్నదైనా సరే మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు విద్య. తనకు గనుక అవకాశం వస్తే కచ్చితంగా స్వర్గీయ లెజండరీ నటి శ్రీదేవి పాత్రలో జీవించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తా అంటున్నారు.

శుక్రవారం ఓ షోకు హాజరైన విద్యా బాలన్‌ మాట్లాడుతూ… ‘నేను శ్రీదేవి అభిమానిని. తుమ్హారి సులూ సినిమా కోసం శ్రీదేవి నటించిన ‘మిస్టర్‌ ఇండియా’లోని ‘హవా హవాయి’ పాటలో నటిస్తున్నపుడు ఉద్వేగానికి లోనయ్యాను. నాకే గనుక శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేస్తా. అయితే అందుకు చాలా ధైర్యం కావాలి. నాకు ఇష్టమైన నటికి నివాళి అర్పించాలంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ అతిలోక సుందరిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇక తన పాత్రల ఎంపిక గురించి అడిగినపుడు… ‘స్వాభిమానం ఉండాలి, అదే విధంగా మన జీవితంలో ఉన్న ముఖ్య వ్యక్తి మనమే అని భావించాలి. నన్ను అలాగే పెంచారు. అందుకే ఇష్కియా సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకొన్నా అని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu