విక్టరీ వెంకటేష్, యువ నటుడు వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘f2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ఇందులోని మొదటి పాట టీజర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. ‘క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో.. 1947 ఆగస్టు 15ని నేడే చూసినట్లు ఉందిరో.. రెచ్చిపోదాం బ్రదర్..’ అని సాగే ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. వెంకీ, వరుణ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి ఆనందంగా సందడి చేస్తూ కనిపించారు.
వరుణ్ ప్రస్తుతం ‘అంతరిక్షం’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది. సంకల్ప్ దర్శకుడు. అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథే ఇది. వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు.