HomeTelugu Trendingకాలేజ్‌ స్టూడెంట్స్‌తో క్రికెట్‌ ఆడిన వెంకటేష్‌

కాలేజ్‌ స్టూడెంట్స్‌తో క్రికెట్‌ ఆడిన వెంకటేష్‌

victory venkatesh played cr

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేశ్ ఆంధ్రాలో పర్యటించారు. విజయవాడ, గుంటూరులో సందడి చేశారు. బెజవాడ కనకదుర్గమ్మను ఈ సినిమా బృందం దర్శించుకుంది.

అనంతరం బాబాయ్ హోటల్ లో వెంకటేశ్ సందడి చేసిన విషయం తెలిసిందే. వెంకటేశ్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సైంధవ్ టీమ్ వివిధ సిటీలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ లతో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విజయవాడ నుంచి గుంటూరు చేరుకున్న సైంధవ్ టీమ్.. వీవీఐటీ కాలేజ్ లో ఓ పాటను రిలీజ్ చేశారు. గుంటూరులో కాలేజీ విద్యార్థులతో కలిసి వెంకటేశ్ సందడి చేశారు. వీవీఐటీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రమంలో వెంకటేశ్ కాసేపు బ్యాటింగ్ చేసి విద్యార్థులను అలరించారు.

వీవీఐటీ విద్యార్థులతో వెంకటేశ్, శైలేశ్ కొలను టీమ్ తలపడింది. ఈ గల్లీ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘వెంకీ మామా బ్యాటింగ్ అదుర్స్’ అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu