కోలివుడ్ హీరో ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ‘అసురన్’ సంచలన విజయం సాధించింది. కాగా ఈ చిత్రం తెలుగు రీమేక్‌పై కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.
ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసురన్ రీమేక్ చేయబోతున్నాడు ఈయన. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.