HomeTelugu Big Storiesవిక్టరీ వెంకటేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

విక్టరీ వెంకటేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

1 12
1960 డిసెంబర్ 13న కారంచేడులో జన్మించారు వెంకటేష్‌.. ఈ రోజు 59వ ఏట అడుగుపెట్టాడు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా 1986లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోగా ఇప్పటికీ కొనసాగుతూ..మారుతున్న కాలంతో పాటు తన నటనలోనూ మార్పులు చేసుకుంటూ… సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేసిన హీరో వెంకటేష్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా..సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్‌. వరుస విజయాలతో విక్టరినే ఇంటిపేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్. వెంకటేష్‌ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఇప్పటివరకు 72 సినిమాలు చేశాడు. అందరి హీరోలా కాకుండా…తనదైన డిఫరెంట్ యాక్టింగ్‌తో క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు వెంకీ. మారుతున్న కాలంతో పాటు తన నటనలోనూ మార్పులు చేసుకుంటూ… సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు వెంకటేష్‌.

దగ్గుబాటి వెంకటేష్‌.. ఈ పేరు కంటే విక్టరీ వెంకటేష్‌ అంటేనే చాలామంది గుర్తుపడతారు. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది.. కానీ ప్రతిభ ఉంటేనే తరువాత రాణించగలుగుతాం..అని నిరూపించిన హీరో వెంకటేష్‌. టాలీవుడ్‌లో సక్సెఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి అండతో ‘కలియుగ పాండవులు’ మూవీతో తొలిఅడుగులు వేసినా…తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోగా స‌త్తా చూపిస్తూనే ఉన్నాడు వెంక‌టేష్.

1b

వెంకటేష్‌ కెరీర్ విషయానికొస్తే…‘శ్రీనివాస కళ్యాణం’, ’స్వర్ణకమలం’, ’గణేష్’, ‘తులసి’, ‘లక్ష్మి’, ‘నువ్వునాకు నచ్చావ్’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. వీటితో పాటు ‘బొబ్బిలి రాజా’, ‘శత్రువు’, ‘ధర్మచక్రం’, వంటి మాస్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు. ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘వాసు’ లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యాడు.

సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ సినిమా వెంకటేష్‌కు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. మరోవైపు 1991లో వచ్చిన ‘చంటి’ వెంకటేష్‌ కెరీర్‌లో మరో మైలురాయి. ఈ సినిమాలో అమాయక పాత్రలో వెంకీ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా హిందీలో ‘అనాడి’గా రీమేక్ అయ్యింది. ఈ సినిమాతో వెంకటేష్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

ప్రజెంట్ జనరేషన్‌లో తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మరోసారి ఊపిరి పోసాడు వెంకీ. మహేష్ బాబుతో చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ … ఆ తర్వాత రామ్‌తో కలిసి ‘మసాలా’, పవన్ కళ్యాణ్‌తో ‘గోపాలా గోపాలా, వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’, లాంటి సినిమాలు చేసి తెలుగులో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి.

తాజాగా మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీమామ’తో పలకరించబోతున్నాడు. 33యేళ్లకు పైగా సినీ ప్రయాణంలో 70కి పైగా సినిమాలు చేసిన ఈ విక్టరీ హీరో.. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండటం విశేషం.

1a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu