
Chhaava OTT release date:
విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమాపై ప్రస్తుతం బాలీవుడ్‌లో హంగామా నడుస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, ఇంకా కొన్ని లిమిటెడ్ థియేటర్స్‌లో మంచి కలెక్షన్లతో నడుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఇది బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం అయింది!
ఛావా సినిమా ప్రముఖ రచయిత శివాజీ సావంత్ రాసిన మారాఠీ నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కథ మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన యోధుడు, శివాజీ, ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా సాగుతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సమర్ధవంతంగా సంభాజీ పాత్ర పోషించాడు. అతని నటనకి సినీ ప్రేమికులు, విమర్శకులు శభాష్ అనిపించారు.
#Chhaava OTT RELEASE APRIL 11 @Netflix_INSouth @NetflixIndia @netflix pic.twitter.com/8oC8CKjz8o
— OTTGURU (@ottguru3) April 6, 2025
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేష్ విజాన్ మద్దాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇందులో రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ముఖ్యపాత్రల్లో కనిపించారు. హిందీలో ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత, తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా, ఇక్కడ కూడా మంచి స్పందన వచ్చింది.
ఇప్పటికే డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 11 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. విక్కీ కౌశల్ కెరీర్‌లో ఇది మైలురాయిగా నిలిచే చిత్రం అనే చెప్పాలి.
ఇప్పటి పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్లు తాము నటించిన సినిమాలతో స్ట్రగుల్ అవుతుంటే, విక్కీ మాత్రం చావాతో తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు.
ALSO READ: Telugu Pan-India సినిమా కారణంగా కోర్టు మెట్లెక్కనున్న బాలీవుడ్ నిర్మాత