టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాపై.. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన ‘ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చనే చక్కని సందేశం ‘శ్రీకారం’ చిత్రం ద్వారా అందించారని.. యువత చూడాల్సిన సినిమా శ్రీకారం అని వెంకయ్య నాయుడు కొనియాడారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ చిత్రానికి చక్కని విశ్లేషణ అందించారు వెంకయ్య నాయుడు. యువత చూడదగిన చక్కని చిత్రం శ్రీకారం’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు వెంకయ్య నాయుడు. అయితే వెంకయ్య నాయుడు ట్వీట్స్‌పై హీరో శర్వానంద్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలుపారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీకారం చిత్రం మార్చి 11న విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది. బి. కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. pic.twitter.com/yDoho6IH0W
— Vice President of India (@VPSecretariat) March 22, 2021
అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం. pic.twitter.com/MM6Ea9mt1U
— Vice President of India (@VPSecretariat) March 22, 2021
Thank you so much sir 🙂
Means a lot 🙏🏼🙏🏼🙏🏼 https://t.co/kcMyZ0d608— Sharwanand (@ImSharwanand) March 22, 2021