Vishwambhara Release Date:
Vishwambhara సినిమా చిరంజీవి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ సొషియో-ఫాంటసీ సినిమా. మొదట ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలకోసమేనని టాక్. అయితే, ఇది ఒక సగం మాత్రమే నిజం అని.. అసలు కారణం వేరు అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
సినిమాలో ప్రధాన అంశాలు చాలా వరకు వీఎఫ్ఎక్స్‌పై ఆధారపడి ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీఎఫ్ఎక్స్ పనుల రిజల్ట్ అనుకున్నంత సంతృప్తికరంగా లేదు అని సమాచారం. సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగాలేకపోవడంతో, దర్శకుడు వశిష్ట దీనిపై కొంత డిజప్పాయింట్ అయ్యారట.
#Vishwambhara : Release Date Removed from Teaser Announcement Poster! pic.twitter.com/h7BBgykPDg
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2024
ఈ సమయంలో చిరంజీవి ఈ సమస్యకి పరిష్కారంగా వీవీ వినాయక్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వినాయక్ గతంలో చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాలు తీసి హిట్స్ అందుకున్నారు. వినాయక్ ఇటీవల విశ్వంభర సెట్స్‌ను సందర్శించడంతో ఆయన సహకారం కూడా సినిమాకి ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో విశ్వంభర ఇప్పుడు మే 9న విడుదల చేయాలని భావిస్తున్నారు అని టాక్. చిరంజీవి కెరీర్‌లో ఈ తేదీ ఎంతో ప్రత్యేకమైనది. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమా కూడా అదే రోజున విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయింది.
Read More: తెలుగులో Sankranthi సీజన్‌కి రాబోతున్న 6 భారీ చిత్రాలు