కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన జెఠ్మలానీ ఎన్నో సంచలనాత్మక కేసులను వాదించారు. అలాగే అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1923 సెప్టెంబరు 14న జన్మించిన ఆయన.. సంచలనాత్మక కేసులు వాదించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, జెఠ్మలానీ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు… ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతితెలిపారు.