సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చిత్ర సీమకు చెందిన దిగ్గజ నటులు కన్నుమూసారు. తాజాగా మరో నటిని కోల్పోయింది. కన్నడలో ఎన్నో సినిమాల్లో తల్లి, అమ్మమ్మ, నానమ్మ పాత్రలతో అలరించిన సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈమె కన్నడ చిత్రసీమలో దాదాపు 200 పైగా చిత్రాల్లో వివిధ హీరోలకు తల్లి, నానమ్మ పాత్రలతో నటించి మెప్పించారు. వయసు మీద పడటంతో శాంతమ్మ కన్నుమూసారని ఆమె సన్నిహితులు తెలిపారు. మైసూర్లో ఉండే శాంతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. ఆమె మృతితో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పై కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు