చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటిపేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజండరీ నటి.
ఆమె ఐదేళ్ల సినీ కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా సేవలు కూడా అందిచారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు. లలిత మృతిపట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అనేక మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పించారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, కీర్తి సురేష్, మంజూ వారియర్ కూడా లెజెండరీ నటి మృతితో ఆమెను తలచుకుని భావోద్వేగ పోస్ట్ రాశారు.
Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I’ve known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022
Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty.
My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb
— Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022