Naga Chaitanya Sobhita Dhulipala Wedding:
Naga Chaitanya – శోభితా ధూళిపాళ్ల వివాహం గురించి అభిమానుల్లో ఉత్కంఠ మొదలైనప్పటి నుంచి వివాహ వేడుక స్థలంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఈ ఏడాది ఆగస్టులో ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తరువాత వివాహం రాజస్థాన్‌లోని పెద్ద ప్యాలెస్ లో ఉంటుంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రత్యేకంగా రాజస్థాన్‌లో ఏదో ఒక పెద్ద ప్యాలెస్ లో వీరి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి కానీ వారు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్థానిక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి వివాహ వేడుక నవంబర్ 4న జరిగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అక్కినేని కుటుంబం త్వరలోనే సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపనున్నారని సమాచారం. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరు కావచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే శోభితా ధూళిపాళ్ల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పసుపు దంచే వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. అక్కినేని కుటుంబం వివాహ వేడుక జరగబోయే అన్నపూర్ణ స్టూడియోస్ స్థలాన్ని అందంగా అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమం హై ప్రొఫైల్ వివాహ వేడుకగా ఉండే అవకాశం ఉంది.