HomeTelugu Trendingరామారావు ఆన్ డ్యూటీ: వేణు ఫస్ట్‌లుక్‌

రామారావు ఆన్ డ్యూటీ: వేణు ఫస్ట్‌లుక్‌

Venu thottempudi look from
టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం యూనిక్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోంది. దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో అల‌నాటి హీరో, సీనియ‌ర్ యాక్ట‌ర్ వేణు తొట్టెంపూడి సిల్వ‌ర్ స్క్రీన్‌కు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా మేక‌ర్స్ వేణు పాత్ర‌కు సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో సీఐ ముర‌ళీగా క‌నిపించ‌నున్న‌ట్టు ప్రకటించారు. ఎప్పుడూ న‌వ్వుతూ ఫ‌న్‌గా క‌నిపించే వేణు ఈ సారి మాత్రం సీఐగా కొంచెం సీరియ‌స్‌గానే క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో స‌ర్ప‌ట్టా ఫేం జాన్ విజ‌య్‌, చైత‌న్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. జులై 29న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu