HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో వేణు తొట్టెంపూడి!

మహేష్‌ సినిమాలో వేణు తొట్టెంపూడి!

Venu thottempudi in mahesh

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశాడు. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ సినిమా అంతగా హిట్‌ కాలేదు. చాలాకాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వేణుకి హిట్ పడలేదే అని చాలామంది ఫీలయ్యారు. ఈ నేపథ్యంలోనే వేణుకి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ – వేణు ఇద్దరూ కూడా ‘స్వయంవరం’ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాకి త్రివిక్రమ్ కథ – సంభాషణలు అందించాడు.

త్రివిక్రమ్ ఇప్పుడు తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ప్రియాంక అరుళ్ మోహన్ మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం వేణుని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu