హాట్ స్టార్ నుంచి వస్తున్న మరో వెబ్ సిరీస్ ‘అతిథి’. ఈ సిరీస్ లో వేణు తొట్టెంపూడి ప్రధానమైన పాత్రను పోషించాడు. ఆయనకి సంబంధించిన ఫస్టు పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. గాయపడిన హీరో .. శత్రువుల స్థావరంలో ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు.
వేణు చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. గతంలో వేణు హీరోగా విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను చేశాడు. చాలా గ్యాప్ తీసుకున్న తరువాత ఆయన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.