HomeTelugu Trendingవెన్నెల కిశోర్ హీరోగా చారి 111

వెన్నెల కిశోర్ హీరోగా చారి 111

Vennela Kishore Chari 111

వెన్నెల కిశోర్ హీరోగా ఓ స్పై యాక్షన్ కామెడీ సినిమా రూపొందుతోంది. ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

టాలీవుడ్‍లో వెన్నెల కిశోర్ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. ప్రస్తుతం టాప్ కమెడియన్లలో ముందు వరుసలో ఉన్నారు వెన్నెల కిశోర్. కమెడియన్‍గా చాలా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. చారి 111 మూవీలో వెన్నెల కిశోర్ స్పై ఏజెంట్‍గా నటిస్తున్నారు. స్పై ఏజెంట్‌గా కన్‍ఫ్యూజ్ అవుతూ నవ్వించేలా ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

కామిక్‍లా ఉన్న ఈ వీడియోకు కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో వివరించారు. కొన్ని పాత్రలను పరిచయం చేశారు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఓ సిటీలో ప్రమాదం వచ్చిందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి దొరికింది మాత్రం ‘లక్ ఉండి టాలెంట్ లేని, స్టైల్ ఉండి స్టఫ్ లేని ఒక ట్యూబ్ లైట్ గాడు’ అంటూ వెన్నెల కిశోర్ ‘చారి 111’ పాత్రను పరిచయం చేశారు. డిస్‍ఫంక్షనల్ ఏజెంట్ అంటూ హింట్ ఇచ్చారు. ఈ వీడియో ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఇంకా ఈ మూవీలో మురళీ శర్మ, సంయుక్త విశ్వనాథన్, ప్రియామాలిక్ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu