HomeTelugu Trendingరాశీఖన్నాకు 'వెంకీమామ' నుంచి బర్త్‌డే గిఫ్ట్

రాశీఖన్నాకు ‘వెంకీమామ’ నుంచి బర్త్‌డే గిఫ్ట్

3 30టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్‌‌, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శనివారం రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రాశీఖన్నా పాత్రను తెలియజేసేలా ఓ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆమె అభిమానుల నుంచి ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌‌, నాగచైతన్య మామా అల్లుళ్లుగా సందడి చేయనున్నారు. ప్రకాశ్‌రాజ్‌, సంపత్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu