HomeTelugu Trendingఅల్లుడు బర్త్‌డే .. వెంకీ మామ సర్‌ప్రైజ్‌

అల్లుడు బర్త్‌డే .. వెంకీ మామ సర్‌ప్రైజ్‌

9 20

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. చైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేక సర్‌ప్రైజ్‌ను విడుదల చేసింది. ఇందులో ‘నా మేనల్లుడి లవ్‌స్టోరీ టైటానిక్‌ రేంజ్‌లో ఉంటుంది అనుకున్నాను.. కానీ ఊర్లో పడవ రేంజ్‌లో కూడా లేదు..’ అంటున్నారు ‌. వెంకీకి చైతన్య నటి రాశీ ఖన్నాతో తన ప్రేమకథ వివరించే తీరు నవ్వులు పూయిస్తోంది. ‘వాడు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించాలి..’ అంటూ ఆర్మీ అధికారి గెటప్‌లో చైతన్య చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రచార చిత్రం నెట్టింట్లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.కేఎస్‌ రవీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చైతు, వెంకటేష్‌ మామ, అల్లుళ్లుగా సందడి చేయబోతున్నారు. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, సంపత్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu