HomeTelugu TrendingVenky Anil3: మళ్ళీ సంక్రాంతి సెంటిమెంట్ తో వెంకటేష్

Venky Anil3: మళ్ళీ సంక్రాంతి సెంటిమెంట్ తో వెంకటేష్

Venky Anil3 team kickstarts the shoot
Venky Anil3 team kickstarts the shoot

Venky Anil3:

ఇప్పటిదాకా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 రెండు సినిమాకి సంక్రాంతి సందర్భంగానే విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. అందుకే ఈసారి కూడా వాళ్ళ కాంబో లో వస్తున్న మూడవ సినిమాను కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ను ఫైనల్ గా మొదలు పెట్టారు. ఈ విషయాన్ని ఒక చిన్న వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో సినిమా లో హిరోయిన్ గా కనిపించనున్న మీనాక్షి చౌదరి వీడియోలో చెప్పుకొచ్చింది. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న కొందరు నటి నటులు కూడా ఈ వీడియోలో కనిపించారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వెంకీ అనిల్ కాంబినేషన్లో వచ్చిన మిగతా రెండు సినిమాల లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక ట్రయాంగిలర్ క్రైమ్ ఎంటర్టైనర్ అని చిత్ర బృంద ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ ఎగ్స్ భార్యగా కనిపిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించానుంది అని తెలుస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్ట్రార్డినరీ ఉండబోతోంది అని నిర్మాతలు చెబుతున్నారు.

మరోవైపు ఈ మధ్యనే సైంధవ్ సినిమాలో చాలా సీరియస్ పాత్రలో కనిపించిన వెంకటేష్ ని మళ్లీ ఎంటర్టైనింగ్ పాత్రలో చూడాలని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu